Sunday, July 8, 2012

Telugu Jokes 2

వంశ పారంపర్యం

"వెంకయ్యగారూ... ఈ జబ్బు మీతో రాలేదు. వంశపారంపర్యంగా వచ్చింది. ఆపరేషన్ చేస్తే పోతుంది" చెప్పాడు డాక్టర్.
"అమ్మయ్య... బతికించారు. అయితే ఆ అపరేషనేదో మా తాతయ్యకు చెయ్యండి" చెప్పాడు వెంకయ్య. పట్టుదల

"పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది లేదోయ్" అన్నాడు నరసింహం

"అలాగా.... అయితే ఈ గ్లాసులో పాలు కింద పోస్తాను. మీ పట్టుదలతో తిరిగి గ్లాసులో నింపండి చూద్దాం" ఎదురన్నాడు కుర్రాడు.







"మా నాన్నగారి death certificate submit చేస్తే కానీ మా అమ్మకు pension ఇవ్వరట. అదేదో ఇచ్చి పుణ్యం కట్టుకోండి డాక్టర్ గారు.

"ఓ.. అలాగా... దానికేం భాగ్యం.... ఇంతకీ మీ నాన్న గార్ని treat చేసిన డాక్టరెవరు?
"ఆయన అదృష్టవంతులండి.. ఏ డాక్టర్ treat చెయ్యలేదండీ... ఆయనంతట ఆయనే పోయారు...."







న్యూటన్ - బెల్టు


9"న్యూటన తల మీద ఆపిల్ పడి భూమ్యాకర్షణ శక్తిని కనుక్కోవడం వల్ల మనం బతికిపోయాం కదమ్మా" స్కూల్లో పాఠం విని వచ్చాక తల్లితో చెప్పడు బంటీ.

"అదేంట్రా? " అడిగింది తల్లి.

"నాన్నది బెల్టుల బిజినెస్ కదా. మరి భూమ్యాకర్షణ లేకపోతే వాటినెవరు కొంటారు" వివరించాడు బంటీ.



నమ్మకం

డబ్బు కోసం బ్యాంకును దోచుకోవాలనుకున్నాడు హరి.

లోపలికి ప్రవేశించి లాకర్ దగ్గరికి వెళ్ళగానే "దయచేసి పేల్చడమో, కోయడమో చెయ్యవద్దు. తలుపు తెరిచే ఉన్నది హ్యాండిల్ తిప్పండి చాలు" అని రాసుండటంతో ఆ పని చేశాడు.


వెంటనే ఒక ఇసక బస్తా నెత్తి మీద పడింది. అలారం మోగింది. దాంతో పోలిసులకు దొరికిపోయాడు.


వ్యాన్*లో తీసుకెళ్తుంటే "హు.... ఏం మనుషులో ఏమో. ఈ రోజుల్లో నమ్మించి మోసం చేయడం మామూలైపోయింది" అనుకున్నాడు విచారంగా.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...